రిచాకి విలన్ గా మారిన హన్సిక

రిచాకి విలన్ గా మారిన హన్సిక

Published on Oct 27, 2012 4:10 PM IST

హన్సిక మరోసారి రిచా గంగోపాధ్యాయ్ కి విలన్ అయ్యింది. అదేనండి ఈ బబ్లీ హీరొయిన్ కార్తీ రాబోతున్న చిత్రం “బిరియాని” లో రిచా గంగోపాధ్యాయ్ స్థానంలో నటించనుంది. మొదట ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్ నటిస్తుంది అని చెప్పగా మరో కొద్దిరోజుల్లో చిత్రం మొదలవుతుంది అనగా ఇప్పుడు రిచా స్థానంలో హన్సిక నటిస్తున్నట్టు తెలుస్తుంది. సుందర్ సి చిత్రం “తీయ వెలి సేయ్యనుం” అనే చిత్రంలో మరియు వెంకట్ ప్రభు దర్శకత్వంలో “బిరియాని” చిత్రంలోనూ నటిస్తున్నాను అని హన్సిక ధ్రువీకరించారు. కార్తి సరసన హన్సిక నటించడం ఇదే మొదటిసారి. ఇది కాకుండా ప్రస్తుతం ఈ భామ సూర్య సరసన “సింగం 2”, శింభు సరసన “వెట్టైమన్నన్” మరియు “వాలు” చిత్రాలలో కనిపించనుంది.

తాజా వార్తలు