OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!

OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!

Published on Jul 31, 2025 6:00 PM IST

og movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ బ్లాస్టింగ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు. ఓజి చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్లు వారు తాజాగా అనౌన్స్ చేశారు. పవన్ పవర్‌ఫుల్ లుక్స్‌తో డిజైన్ చేసిన ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. ఇక ఈ సినిమాలోని ఫస్ట్ బ్లాస్ట్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం మరో మేజర్ అట్రాక్షన్ కానుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఓజి చిత్రాన్ని సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు