విష్ణు కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా

విష్ణు కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా

Published on Oct 26, 2012 10:42 AM IST


మంచు విష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘దేనికైనా రెడీ’. ఈ సినిమా విష్ణు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సాదించింది. ఇప్పటికే ఈ చిత్ర కలెక్షన్స్ విష్ణు కెరీర్లో సూపర్ హిట్ సినిమా అయిన ‘ఢీ’ సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేసిందని అంచనా వేస్తున్నారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా అందరి నుంచి మంచి టాక్ తెచ్చుకుంది మరియు విమర్శకుల నుండి కూడా మన్ననలు అందుకుంది. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాకి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాలో ఆధ్యంతం బ్రహ్మానందం మరియు ఎం.ఎస్ నారాయణ తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. గోపి మోహన్ మరియు కోనా వెంకట్ కథ అందించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మరియు చక్రి సంయుక్తంగా సంగీతాన్ని అందించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మాచు విష్ణు ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు