మరింత ‘కిక్ ‘ కోసం స్క్రీన్ ప్లే రాస్తున్న చేతన్ భగత్

మరింత ‘కిక్ ‘ కోసం స్క్రీన్ ప్లే రాస్తున్న చేతన్ భగత్

Published on Oct 26, 2012 11:46 AM IST


మాస్ మహారాజ రవితేజ – గోవా బ్యూటీ ఇలియానాహీరో హీరోయిన్లుగా వచ్చిన ‘కిక్’ సినిమా టాలీవుడ్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా, సాజిద్ నదియావాలా దర్శకత్వంలో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఇండియన్ ఫేమస్ నవలా రచయిత చేతన్ భగత్ స్క్రీన్ ప్లే అందించనున్నారు. ‘ ఈ విషయం మీ అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్ – సాజిద్ నదియావాలా కాంబినేషన్లో రానున ‘కిక్’ సినిమాకి స్క్రీన్ ప్లే రాయబోతున్నాను. సాజిద్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో ఇంకా టఫ్ గా స్క్రీన్ ప్లే కావాలని నన్ను అడిగారు. అందుకోసం నేను ముందు ‘కిక్’ ఒరిజినల్ అయిన తెలుగు వెర్షన్ చూడబోతున్నాను. భారీ అంచనాలున్న ఈ సినిమాలో కొన్ని మార్పులు కూడా చేస్తాను. నాకు మీ అందరి ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నాను’ అని చేతన్ భగత్ ట్వీట్ చేసారు. చేతన్ రాసిన ‘ఫైవ్ పాయింట్ సంవన్’, ‘వన్ నైట్ అట్ కాల్ సెంటర్’, ‘3 మిస్టేక్స్ అఫ్ మై లైఫ్’ మరియు ‘2 స్టేట్స్’ నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. అతని నవలలని కొన్ని సినిమాల్లో కూడా ఉపయోగించుకున్నారు. చేతన్ మొదటి సారి ఓ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

తాజా వార్తలు