చమ్మక్ చల్లో ట్రైలర్ విడుదల

చమ్మక్ చల్లో ట్రైలర్ విడుదల

Published on Oct 29, 2012 6:54 PM IST


షో, మిస్సమ్మ, విరోధి వంటి చిత్రాలతో విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నీలకంఠ డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘చమ్మక్ చల్లో’. వరుణ్ సందేశ్, సంచిత పదుకొనే, కేథరిన్ తెరిసా, బ్రహ్మాజీ, షాయాజీ షిండే, వెన్నెల కిషోర్ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ తాను మొదటిసారి లవ్ స్టొరీ చేస్తున్నాని, హీరో పాత్ర రొమాంటిక్ గా ఉంటుందని రొమాంటిక్ నేచర్లో ఈ చిత్రం సాగుతుందని అన్నారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ సినిమాలో తను వరుణ్ సందేశ్ తండ్రి పాత్రలో నటిస్తున్నాని, తండ్రిగా కాకుండా స్నేహితుడిలా ఉండే తరహ పాత్ర అన్నారు. ఈ సినిమా ద్వారా సంచితా పదుకొనే, కేథరిన్ తెరిసా పరిచయం కాబోతున్నారు. కిరణ్ వారణాసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్ పై డి.ఎస్ రావు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు