బంపర్ రేటుకి ఈగ హిందీ శాటిలైట్ హక్కులు

బంపర్ రేటుకి ఈగ హిందీ శాటిలైట్ హక్కులు

Published on Oct 29, 2012 8:11 AM IST


అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈగ హిందీ వెర్షన్ ‘మక్ఖి’ శాటిలైట్ హక్కులు బంపర్ రేటుకి అమ్ముడుపోయాయి. ఇటీవలే హిందీలో విడుదలైన మక్ఖి బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లు సాధించింది. తెలుగు తో పాటుగా తమిళ్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా తెలుగులో భారీ హిట్ సాధించడమే కాకుండా తమిళ్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది. తమిళ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈగ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. నాని, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో సుదీప్ విలన్ పాత్ర పోషించారు.

తాజా వార్తలు