జనవరికి వాయిదా పడ్డ బాడ్ బాయ్

జనవరికి వాయిదా పడ్డ బాడ్ బాయ్

Published on Oct 27, 2012 7:50 PM IST


కార్తి, అనుష్క ప్రధాన పాత్రలలో వస్తున్న “బాడ్ బాయ్” చిత్రం వచ్చే సంవత్సరానికి వాయిదాపడింది. సూరజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కతుంది. ఈ చిత్ర డబ్బింగ్ హక్కులను బెల్లంకొండ సురేష్ భారీ ధరకు సొంతం చేసుకుంది. కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది ఇక అనుష్క ఇక్కడ ప్రధాన హీరొయిన్ కావడంతో ఈ చిత్రానికి మరింత బలం చేకూరింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తమిళంలో “అలెక్స్ పాండియన్” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట దీపావళికి విడుదల కావలసి ఉంది కాని నిర్మాత జ్ఞానవేల్ రాజ ఈ చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు ఇదే గనుక జరిగితే ఈ చిత్రంకి భారీ పోటీ ఎదురుకానుంది రామ్ చరణ్ “నాయక్” ప్రభాస్ “మిర్చి” సంక్రాంతికే విడుదల కానున్నాయి. కార్తి చివరి చిత్రం “శకుని” ఇక్కడ పరాజయం చవిచూసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు