‘బాహుబలి ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ లాక్..!

‘బాహుబలి ది ఎపిక్’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ లాక్..!

Published on Oct 16, 2025 10:02 PM IST

Baahubali The Epic

టాలీవుడ్ సత్తాను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా తదితరులు లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ‘బాహుబలి 2’ తొలి భాగాన్ని మించి సత్తా చాటడంతో రాజమౌళి పేరు ప్రపంచ సినిమాలో మార్మోగింది.

అయితే, ఇప్పుడు ప్రేక్షకులకు మరోసారి ఆ థ్రిల్ అందించేందుకు ‘బాహుబలి ది ఎపిక్’ రూపంలో రెండు సినిమాలను ఒకే సినిమాగా మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా కోసం కూడా దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ మొత్తం పూర్తయింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా, ఈ చిత్రానికి 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు.

దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు