‘మాస్ జాతర’ ప్రమోషన్స్.. బిగ్ బాస్‌లో మాస్ రాజా మెరుపులు..!

‘మాస్ జాతర’ ప్రమోషన్స్.. బిగ్ బాస్‌లో మాస్ రాజా మెరుపులు..!

Published on Oct 17, 2025 12:14 AM IST

Mass-Jathara

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ క్రమంలో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుల్లితెరపై దూసుకెళ్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ‘మాస్ జాతర’ టీమ్ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీపావళి ట్రీట్‌గా ఈ వీకెండ్‌లో బిగ్ బాస్ హౌజ్‌లో మాస్ జాతర టీమ్ సందడి చేయనుంది.

దీంతో అక్కినేని నాగార్జునతో రవితేజ ఎలాంటి సందడి చేయబోతున్నాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక మాస్ జాతర చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజా వార్తలు