ఓటిటి సమీక్ష: ‘ఒక మంచి ప్రేమకథ’ – తెలుగు ఒరిజినల్ చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘ఒక మంచి ప్రేమకథ’ – తెలుగు ఒరిజినల్ చిత్రం ఈటీవీ విన్ లో

Published on Oct 16, 2025 9:04 PM IST

Oka-Manchi-Prema-Katha

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : అక్టోబర్ 16, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : రోహిణి మొల్లేటి, రోహిణి హట్టంగడి, సముద్రఖని తదితరులు
దర్శకత్వం : అక్కినేని కుటుంబరావు
నిర్మాణం : స్థిర ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి
సంగీతం : కే ఎం రాధా కృష్ణన్
ఛాయాగ్రహణం : మధు అంబట్
కూర్పు : లెనిన్ బి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్స్ లో ఒకటైన పాపులర్ సంస్థ ఈటీవీ విన్ నుంచి ఈ వారం రిలీజ్ కి వచ్చిన కొత్త కంటెంట్ లో తమ ఒరిజినల్ చిత్రం “ఒక మంచి ప్రేమ కథ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

రంగమణి (రోహిణి హట్టంగడి) తన కూతురు, కుటుంబానికి దూరంగా ఒక వాటర్ ప్లాంట్ ని నడుపుతూ తన వృద్ధాప్య జీవనాన్ని సాగిస్తారు. ఆమె కూతురు సుజాత (రోహిణి మొల్లేటి) అలాగే అల్లుడు ఈశ్వర్ (సముద్రఖని) లు కనీస తీరిక లేకుండా తన ఆఫీస్ లైఫ్ ని గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలో రంగమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది. దానికి తోడు ఎంతో ఒంటరితనం తన కూతురుకి ఫోన్ చేసినా ఆమె సరిగ్గా మాట్లాడదు. ఇంకో పక్క సుజాత ఓ కంపెనీకి సీఈఓ కావాలని అహర్నిశలు కష్టపడుతుంది. ఈ క్రమంలో సుజాత తన తల్లిని ఒక ఓల్డేజ్ హోమ్ లో చేర్పించడానికి తన తల్లి దగ్గరికి వెళుతుంది. ఇక అక్కడ నుంచి కథ ఎలా మారింది? సుజాత తన తల్లిని చేర్పించిందా లేదా తానే అక్కడ ఉండిపోయిందా? ఎక్కువ సమయం లేని రంగమణి తన చివరి రోజుల్లో ఎలాంటి ముగింపు చూసారు? ఈ అంశానికి కార్పోరేట్ వరల్డ్ ఎంప్లాయిస్ కి ఉన్న లింక్ అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో మేజర్ గా వర్కౌట్ అయ్యే అంశం ఏదన్నా ఉంది అంటే కదిలించే ఎమోషనల్ డ్రామా అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు వెర్సటైల్ నటులు రోహిణిల ఇద్దరి నడుమ డ్రామా చాలా బాగా సాగుతుంది. ఒక ఎమోషన్ నుంచి మొదలై మరో బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీగా సాగిన తీరు ఈ తరహా ఎమోషనల్ సినిమాలని ఇష్టపడేవారిని మెప్పించి తీరుతుంది.

అలాగే రోహిణి ఎప్పుడైతే తన తల్లి పాత్ర దగ్గరకి వస్తుందో అక్కడ నుంచి కథనం డీసెంట్ గా వెళుతుంది అని చెప్పాలి. తెలిసినట్టే సాగే ఈ కథనంలో ఎమోషనల్ పార్ట్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. కొంచెం వింటేజ్ టచ్ తో ఇద్దరు తల్లీ కూతుళ్ళ నడుమ సాగే ప్రేమ, ప్రేమ అంటే కేవలం ఒక ఆడ మగ నడుమ ఉండే ప్రేమ మాత్రమే కాకుండా తల్లిదండ్రులకి వారి పిల్లల నడుమ ఉండేది కూడా ప్రేమే కదా అనే పాయింట్ ఇందులో బాగుంది అనిపిస్తుంది.

ఇలా వీరి నడుమ సన్నివేశాలు మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ కి చాలామందికి కనెక్ట్ అవుతాయి. ఇక ఇందులో దర్శకుడు చెప్పాలనుకున్న మరో పాయింట్ నిజ జీవితంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కానీ తమ తల్లిదండ్రుల చివరి రోజుల్లో కార్పోరేట్ ఎంప్లాయిస్ కి ఒక నెల రోజుల సెలవులు ఇచ్చే కాన్సెప్ట్ తో కూడిన సందేశం బాగుంది. ఇక నటీనటులు రోహిణి మొల్లేటి రోహిణి హట్టంగడి తమ పాత్రల్లో బాగా చేశారు. రోహిణి మొల్లేటి నుంచి ఇది కొంచెం డిఫరెంట్ యాంగిల్ అని చెప్పవచ్చు. అలాగే నటుడు సముద్రఖని కూడా ఈ చిత్రంలో చాలా బాగా చేశారు. అలాగే వీరితో పాటుగా కనిపించిన యువ నటీనటులు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో పాయింట్ ఇటీవల వస్తున్న తల్లిదండ్రులు వారికి దూరంగా ఉంటున్న పిల్లలు, బిజీ లైఫ్ లో తమ తల్లిదండ్రులు ఏం మిస్ అవుతున్నారు అందులో వారి పిల్లలు కూడా ఏం మిస్సవుతున్నారు అనే పాయింట్ లోనే సాగుతుంది. సో ఇది వరకే ఈ తరహా కాన్సెప్ట్ లు మనం చూసాం కానీ ఇందులో ఇచ్చిన సందేశం ఒకటి కొత్తగా అనిపిస్తుంది.

సో మరీ కొత్తదనం లాంటివి కోరుకునేవారికి ఈ చిత్రం రెగ్యులర్ గానే అనిపించవచ్చు. అలాగే మేజర్ డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అలా స్లోగా సాగే కథనం అని చెప్పాలి. కథనం మాత్రం ఒకింత నెమ్మదిగానే సాగుతూ వెళుతుంది. అక్కడక్కడా మంచి ఎమోషన్స్ బాగున్నాయి కానీ ప్రాసెస్ ని కొంచెం వేగవంతం చేయాల్సింది.

అలానే పాటలు కూడా బానే ఉన్నాయి కానీ వీటిని కొంచెం కుదించాల్సింది. ఇవి ఎక్కువసేపు ఉండడం కొంచెం బోర్ అనిపిస్తుంది. అలాగే స్టార్టింగ్ లో రోహిణి మొల్లేటిపై కొన్ని సన్నివేశాలు కొంచెం ఓవర్ డ్రమాటిక్ గా కూడా అనిపిస్తాయి. అలాగే శంకర్, డాక్టర్ పాత్రధారులు నటన అంత నాచురల్ గా అనిపించదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్, సెటప్ అంతా నీట్ గా ఉంది. సంగీతం, సినిమాటోగ్రఫీ వర్క్స్ కూడా బాగున్నాయి. కానీ ఎడిటింగ్ కొంచెం బెటర్ గా చేసి ఉంటే బాగుండేది.

ఇక అవార్డ్ విన్నింగ్ ప్రముఖ దర్శకులు అక్కినేని కుటుంబరావు గారి విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాకి బాగుందనే చెప్పవచ్చు. తాను చెప్పదలచుకున్న సందేశం, పాత్రలలోని క్లారిటీ బాగున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ పార్ట్ ఈ చిత్రంలో బాగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే కొంచెం స్లోగా నడిపించిన తీరు, రొటీన్ ప్లాట్ లు నిరాశపరుస్తాయి. ఇది మినహా తన వర్క్ మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఒక మంచి ప్రేమ కథ’ చిత్రం డీసెంట్ ఎమోషనల్ ఫ్లిక్ అని చెప్పొచ్చు. దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశం రొటీన్ ప్లాట్ తో బాగానే ఉంది. మంచి విషయం ఏంటంటే ఇద్దరు రోహిణీలు తమ పాత్రలతో ఆకట్టుకోగా వారిపై సాగే ఎమోషనల్ పార్ట్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే తక్కువ అంచనాలు పెట్టుకుని ఓటిటిలో ఈ ఎపిసోడ్ ని ఫ్యామిలీతో తప్పకుండా ట్రై చేయొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు