మన టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సాలిడ్ రోల్ లో దర్శకులు వెంకట్ కళ్యాణ్ అలాగే అభిషేక్ జైస్వాల్ లు తెరకెక్కించిన సాలిడ్ చిత్రమే “జటాధర”. ఇది కూడా ప్రస్తుతం కొనసాగుతున్న డివోషనల్ టచ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తుండగా రీసెంట్ గానే ఒకో సాంగ్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. మరి ఈ చిత్రం నుంచి అవైటెడ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది.
అయితే ఈ ట్రైలర్ కోసం సూపర్ స్టార్ ది గ్లోబ్ ట్రాటర్ మహేష్ బాబు ముందుకొచ్చారు. దీనితో రేపు అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ కన్ఫర్మ్ చేయడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక ఈ చిత్రానికి రాయిస్ అండ్ జైన్ – సామ్ లు సంగీతం అందించగా ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ ఆరోరా, శిల్పా సింఘాల్ మరియు నిఖిల్ నందా లు నిర్మాణం వహించారు. అలాగే ఈ నవంబర్ 7న సినిమా రిలీజ్ కి రాబోతుంది.