VD14 కథే వేరయా అంటున్న రాహుల్

VD14 కథే వేరయా అంటున్న రాహుల్

Published on Oct 16, 2025 5:10 PM IST

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను కొంతవరకు మాత్రమే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా రిజల్ట్ తర్వాత విజయ్ వేదరకొండ తన నెక్స్ట చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో రూపొందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ పై మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఉగ్రరూపం చూపించబోతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. పీరియాడిక్ డ్రామా చిత్రాల్లో మునుపెన్నడూ రాని విధంగా ఈ సినిమా జనాలను ఆకట్టుకుంటుందని వారు తెలిపారు.

ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు