టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ చిత్రంలో నటి టబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్ టాక్.
నాగార్జున-అనుష్క జంటకు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జంట మరోసారి వెండితెరపై కనిపిస్తే అభిమానులకు నిజంగా పండుగే అవుతుంది. అనుష్కను ‘సూపర్’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది నాగ్ కావడం మరో విశేషం. ఇక ఈ సినిమాలో నాగార్జున డ్యుయెల్ రోల్స్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్.కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది.