‘ఎల్లమ్మ’తో రీసౌండ్ చేసేందుకు సిద్ధమైన దేవిశ్రీ ప్రసాద్..?

‘ఎల్లమ్మ’తో రీసౌండ్ చేసేందుకు సిద్ధమైన దేవిశ్రీ ప్రసాద్..?

Published on Oct 16, 2025 9:00 PM IST

Yellamma-Devi-Sri-Prasad

‘బలగం’ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ సాలిడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు యెల్దండి. ఇక ఈ డైరెక్టర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో ‘ఎల్లమ్మ’ అనే సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతుంది. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరనే విషయంపై మాత్రం మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఈ సినిమాలో హీరోగా చాలా పేర్లు వినిపించినా, చివరకు నితిన్ హీరోగా ఓకే అయ్యాడనే టాక్ బలంగా వినిపించింది. కానీ, రీసెంట్‌గా నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో అని అందరూ అనుకున్నారు. అయితే, ఎవరి ఊహలకు అందని విధంగా ఈ సినిమాకు హీరోను ఫిక్స్ చేశారట మేకర్స్.

టాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చడంతో ఈ చిత్రంతో హీరోగా మారేందుకు దేవిశ్రీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదేగనక నిజం అయితే, ఈ వార్తతో దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు సంతోషంతో ఊప్పొంగిపోతారు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు