మేమేమన్నా నీలి చిత్రాలు తీస్తున్నామా?

మేమేమన్నా నీలి చిత్రాలు తీస్తున్నామా?

Published on Oct 26, 2012 9:01 AM IST


నీలి చిత్రాలేంటి(బ్లూ ఫిల్మ్స్) ఆ గొడవేంటి అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే.. డా. మోహన్ బాబు సెన్సార్ అధికారి ధనలక్ష్మి మీద పూర్తి ఆగ్రహంగా ఉన్నారు దానికి కారణం ‘దేనికైనా రెడీ’ సినిమా. ఈ సినిమా మళయాళ వెర్షన్ ని తన అనుమతి లేకుండా ధనలక్ష్మి సినిమా చూసారు. ఈ విషయం పై డా. మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ ‘ నిర్మాతల అనుమతి లేకుండా ఆమె సినిమా ఎలా చూస్తారు? అందుకే నేను ఈ విషయంపై డిజీపి దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేసాను. అవసరమైతే హై కోర్టుకి కూడా వెళతాను. తమిళ, మళయాళ మరియు హిందీ సెన్సార్ బోర్డ్స్ లో లేని వేదింపులు, ఇన్ని ఆంక్షలు మన తెలుగు సినిమాలకు మాత్రం ఎందుకు? ఆమె నిర్మాతలను కూడా చాలా నీచంగా చూస్తున్నారు. మేమేమన్నా నీలి చిత్రాలు తీస్తున్నామా? మేము అందరూ చూడదగ్గ కుటుంబ కథా చిత్రాలు తీసినా మాకీ టార్చర్ ఏంటి?. అసలు ఆమెకి తెలుగు భాషే రాదు, కానీ ఆమె మన సినిమాలు చూసి సర్టిఫై చేస్తుంది. అసలు ఈమెకి ఆ హోదా ఎవరు ఇచ్చారు? ఆమె అసలు అర్హురాలా? కాదా? అని ఒకసారి ఆలోచించాలి. ఈ విషయంపై ఫిల్మ్ చాంబర్ కూడా నాతో కలిసి పోరాడితే ఎంతో సంతోషిస్తాను అని’ ఆయన అన్నారు.

గత భుధవారం దసరా కానుకగా విడుదలైన దేనికైనా రెడీ’ సినిమా మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్రాన్ని ఈ రోజు మలయాళంలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా సెన్సార్ కాకపోవడం మరియు కొన్ని సమస్యలు ఎదురు కావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

తాజా వార్తలు