రెండు రోజులుగా దర్శకుడు అనిల్ రావిపూడి తన కుమారుడికి మహేష్ స్క్రీన్ నేమ్ ని పేరుగా పెట్టుకున్నాడన్న వార్త సంచలనంగా మారింది. మీడియా మాధ్యమాలతో పాటు, సోషల్ మీడియాలో ఈ వార్త ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ అనే రోల్ చేశారు. అజయ్ కృష్ణ లోని అజయ్ ని తీసుకొని దానికి సూర్యవంశీ జత చేసి, అజయ్ సూర్యవంశీ అని పెట్టుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు మూవీ ఆడియో వేదిక రోజున అనిల్ రావిపూడికి అబ్బాయి పుట్టాడు.
అనిల్ రావిపూడి మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడంతో పాటు, మహేష్ కి కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. చేసింది ఒక్క సినిమానే అయినా అనిల్ రావిపూడి మహేష్ కి చాల దగ్గరై పోయాడు. అలాగే తన కొడుక్కి మహేష్ స్క్రీన్ నేమ్ పెట్టుకునేంత భక్తుడు అయిపోయాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు.