టాలీవుడ్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోయే సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా అనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక సూపర్ హీరో మూవీగా ఈ చిత్రం రానుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమాన్ని పెద్ద ఆడంబరాలు లేకుండా సింపుల్‌గా చేశారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం(జూన్ 12) నుంచి నిర్విరామంగా జరగనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో మరికొందరు హీరోయిన్లు కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.