100 కోట్ల మార్క్ చేరుకోనున్న”అగ్నీపత్”

100 కోట్ల మార్క్ చేరుకోనున్న”అగ్నీపత్”

Published on Feb 3, 2012 9:35 PM IST


ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రానున్న వారంలో బాలివుడ్ అగ్రనటుడు హృతిక్ రోషన్ నటించిన “అగ్నీపత్” చిత్రం 100 కోట్ల వసూళ్లను చేరుకోనుంది. ఈ చిత్రం మధ్య ఇండియా లో మరియు మహారాష్ట్ర లో భారి వసూళ్లను ఇంకా కొనసాగిస్తుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం వ్యయం 75 కోట్లగా ఉండగా ఇప్పటికే ఈ చిత్రం లాభాల్లో చేరుకుంది ఇంకా శాటిలైట్ హక్కులు కూడా కలిపితే నిర్మాతకి మంచి లాభం చేకూరుతుంది. అమితాబ్ బచ్చన్ చిత్రానికి రిమేక్ అయిన ఈ చిత్రం లో సంజయ్ డాట్ మరియు ప్రియాంక చోప్రా లు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు.

తాజా వార్తలు