డిసెంబర్లో సుకుమారుడు

డిసెంబర్లో సుకుమారుడు

Published on Oct 29, 2012 5:07 PM IST


డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా తెలుగు వారికి పరిచయమైన ఆది హీరోగా, నిషా అగర్వాల్ హీరోయిన్ గా ‘సుకుమారుడు’ అనే సినిమా తెరకెక్కుతోంది. జి.అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కె. వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ యూరప్లో జరుగుతోంది. ‘ యూరప్ షెడ్యూల్ తో సినిమాలోని అన్ని పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలిన చిత్రీకరణను తొందరగా పూర్తి చేసి సినిమాని డిసెంబర్లో విడుదల చేయాలని అనుకుంటున్నామని’ ఈ చిత్ర నిర్మాత తెలిపారు.

ఈ చిత్ర కథ గురించి దర్శకుడు చెబుతూ ‘ అమెరికా నుంచి తన స్వగృహానికి వచ్చే పాత్రలో హీరో కనిపిస్తాడు. అతన్ని చూసిన వారందరూ అతన్ని ‘సుకుమారుడు’ అనుకుంటూ ఉంటారు కానీ అతనిలోని దాగున్న కఠినమైన స్వభావం ఎవరికీ తెలియదు. అలాంటి అతనికి ఏమేమి జరిగాయి? అతను ఏమి చేసాడు? అనేది తెరపైనే చూడాలని’ ఆయన అన్నారు. భావన రెండవ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మరియు ‘ఊర్వశి’ శారద గారు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఎం.ఎస్ నారాయణ, చలపతి రావు, తాగుబోతు రమేష్, సంజయ్ మరియు తదితరులు ఇతర తారాగణం.

తాజా వార్తలు