సమీక్ష : బాయ్ మీట్స్ గర్ల్ తొలి ప్రేమకథ – ఓ ఆర్డినరీ లవ్ స్టొరీ.!

సమీక్ష : బాయ్ మీట్స్ గర్ల్ తొలి ప్రేమకథ – ఓ ఆర్డినరీ లవ్ స్టొరీ.!

Published on Mar 28, 2014 6:20 PM IST
Boy-Meets-Girl-Tholiprema-K విడుదల తేది : 28 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం :వసంత దయాకర్
నిర్మాత : శ్రీమతి సునీత
సంగీతం : గురు రాజా
నటినటులు : సిద్దు, కనికా తివారి..

‘ఎల్బీడబ్ల్యూ’ ఫేం సిద్దు హీరోగా కనికా తివారి హీరోయిన్ గా నటించిన సినిమా ‘బాయ్ మీట్స్ గర్ల్ తొలి ప్రేమకథ’. వసంత దయాకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శ్రీమతి సునీత నిర్మాత. గురురాజా సంగీతం అందించిన ఈ ప్రేమకథ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం..

కథ :
ఒక యానిమేషన్ కంపెనీలో సిద్దు(సిద్దార్థ్) క్రియేటివ్ యానిమేటర్ గా పనిచేస్తుంటాడు. సిద్దుకి చిన్నప్పటి నుండి మహాలక్ష్మి అనే పేరంటే ఇష్టం. అదే పేరుతో ఉన్న తన క్లాస్ మేట్ అయిన మహాలక్ష్మి(కవిత తివారి)ని ప్రేమిస్తుంటాడు.

ఒకరోజు మహాలక్ష్మి అనే అమ్మాయి సిద్దు ఆఫీసులో చేరుతుంది. అందరూ ఊహించినట్టుగానే సిద్దు ఆ అమ్మాయికి దగ్గరవుతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం సిన్సియర్ గా సిద్దుని ప్రేమిస్తుంది. కొద్ది రోజులకి సిద్దు ఫస్ట్ లవ్ గురించి తెలుసుకున్న ఆమె సిద్దుని తన ఫస్ట్ లవ్ ని వెతుక్కొమ్మని అల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సిద్దు తన ఫస్ట్ లవ్ ని కలుసుకున్నాడా? లేదా? కనుక్కుంటే ఎలా కనుక్కున్నాడు? అలా చాలా రోజుల తర్వాత ప్రపోజ్ చేస్తే సిద్దు ప్రేమని మహా లక్ష్మి అంగీకరించిందా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

హీరోగా నటించిన సిద్దార్థ్ నటన బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా చేసాడు. కనికా తివారి తన పాత్రకి న్యాయం చేసింది. అలాగే సిద్దు – కనికా తివారి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. హీరో అతని ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి.

వెన్నెల కిషోర్, జబర్దస్త్ శంకర్, చంటి మరికొంతమంది కమెడియన్స్ కామెడీ టైమింగ్ బాగుంది. మొదటి 30 నిమిషాల తర్వాత సినిమా కాస్త వేగవంతమవుతుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కి డైలాగ్స్ కి యువత బాగా కనెక్ట్ అవుతుంది.

మైనస్ పాయింట్స్ :

మొదటి 30 నిమిషాలు చాలా స్లోగా ఉంటుంది. సినిమాకి అవసరం లేని కొన్ని సీన్స్ వల్ల కథ ఎటువైపు వేలుతుండా అనే గందరగోళం ఆడియన్స్ కి కలుగుతుంది. ఈ సినిమాకి పాటలు పెద్ద మైనస్. సెకండాఫ్ చాలా చాలా సాగదీసి వదలడం, ఊహాజనితంగా మారడం వల్ల సినిమా బోర్ కొడుతుంది. దానికి తోడు క్లైమాక్స్ రొటీన్ కే రొటీన్ అనిపించేంత రొటీన్ గా ఉంది.

సాంకేతిక విభాగం :

కొన్ని సీన్స్ లో మాత్రం సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని సీన్స్ బాగా రాలేదు. ఎడిటింగ్ బాలేదు. సెకండాఫ్ పై ఎడిటర్ స్పెషల్ కేర్ తీసుకోవాల్సింది. అలాగే గురు రాజా మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద మైనస్, నేపధ్య సంగీతం మాత్రం ఏదో ఉంది అంటే ఉంది.

నూతన దర్శకుడైన వసంత దయాకర్ కొన్ని సీన్స్ బాగా తీసినప్పటికీ కొన్ని సీన్స్ ని మాత్రం అనుకున్న రేంజ్ లో తీయలేకపోయాడు. చిన్న విషయాన్ని చాలా ఎంటర్టైనింగ్ గా చెప్పాలనుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే సరిగా కుదరకపోవడంతో దెబ్బతిన్నాడు. డైలాగ్స్ బాగున్నాయి.

తీర్పు :

ఈ మధ్య వస్తున్న అన్ని లవ్ స్టోరీస్ లానే ‘బాయ్ మీట్స్ గర్ల్ తొలి ప్రేమకథ’ సినిమా కూడా ఓక ఆర్డినరీ లవ్ స్టొరీ. యూత్ ని ఆకట్టుకునే కొన్ని కామెడీ సీన్స్, డైలాగ్స్ తప్ప ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఇక సినిమా చూడడం చూడకపోవడం మీ ఇష్టం…

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 

తాజా వార్తలు