ఈ సెప్టెంబర్ నెలలో మంచి హిట్ అయ్యిన టాలీవుడ్ చిత్రాల్లో యువ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. మంచు మనోజ్ పవర్ఫుల్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ మంచి నిర్మాణ విలువలతో తెరకెక్కించగా ఈ సినిమా రిలీజ్ అయ్యాక భారీ ఓపెనింగ్స్ ని సాధించి దూసుకెళ్తుంది.
ఇలా రెండో వారంలో కూడా మంచి రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా మొత్తం 12 రోజులు బాక్సాఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది. దీనితో “మిరాయ్” చిత్రం ఈ 12 రోజుల్లో 140.08 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా ఇపుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో మిరాయ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సెట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా శ్రేయ శరన్, జైరాం, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.