టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో నటించిన ఈ సినిమా విజువల్ గ్రాండియర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమాలో విలన్ పాత్రలో మంచు మనోజ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే, ఈ పాత్రలో నటించేందుకు ముందుగా వేరొక హీరోను అప్రోచ్ అయ్యారట మేకర్స్. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌ను ఈ పాత్ర చేయాల్సిందిగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, తేజ సజ్జా కోరారట. అయితే, ఆయనకు పాత్ర నచ్చినా తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల ఈ సినిమాను చేయలేకపోయాడు.
ఇలా ఓ మంచి సినిమాలో పాత్రను మిస్ చేసుకున్నాడు సందీప్ కిషన్. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రకు మంచి ప్రశంసలు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.