‘ఓజి’ కోసం ‘మిరాయ్’ నిర్మాత గ్రేట్ మూవ్!

‘ఓజి’ కోసం ‘మిరాయ్’ నిర్మాత గ్రేట్ మూవ్!

Published on Sep 24, 2025 10:03 AM IST

OG

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ నటించిన సాలిడ్ హిట్ చిత్రం మిరాయ్ కూడా ఒకటి. రెండు వారాల రన్ కావస్తున్నప్పటికీ మన తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో ఈ సినిమాకి ఆదరణ అలాగే కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో అవైటెడ్ చిత్రం ఓజి రిలీజ్ కి వస్తుండగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ ఓజి సినిమా కోసం మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గ్రేట్ మూవ్ తీసుకున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. తన సినిమా విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ రెండు తెలుగు స్టేట్స్ లో మిరాయ్ ఉన్న స్క్రీన్స్ ని ఓజి కోసం ఈ 25న ఇస్తున్నట్టుగా టాక్ వైరల్ అవుతుంది. అలాగే 26 నుంచి కొన్ని థియేటర్స్ లోకి మళ్ళీ మిరాయ్ వస్తుందట. దీనితో టీజీ విశ్వప్రసాద్ తీసుకున్న నిర్ణయానికి పవన్ అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు