పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ ఓవర్సీస్‌లో తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రీమియర్ కలెక్షన్ సాధిస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్ర కంటెంట్ ఇంకా ఓవర్సీస్‌కు చేరకపోవడం ఇప్పుడు ఈ రికార్డులు క్రియేట్ చేయడానికి అడ్డుగా మారింది.
ప్రీ-సేల్స్ ద్వారా రికార్డులు సృష్టించినా, ఫైనల్ ప్రీమియర్ నంబర్స్‌పై దీని ప్రభావం తీవ్రంగా పడనుంది. అమెరికా, కెనడాలో అనేక ప్రీమియర్ షోలు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా AMC లాంటి థియేటర్ చైన్స్‌కు ముందుగానే హార్డ్ డ్రైవ్స్‌లో కంటెంట్ అవసరం ఉంటుంది. కానీ ఇప్పటివరకు అక్కడ బుకింగ్స్ ప్రారంభం కాలేదు.
అమెరికా డిస్ట్రిబ్యూటర్ సమాచారం ప్రకారం సినిమా రెండో భాగం డెలివరీ ఇంకా పెండింగ్‌లోనే ఉందని, త్వరలో పంపించనున్నట్లు ఒక విండో ఇచ్చారు. చివరి నిమిషంలో ఇలా జరిగిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా, దర్శకుడు సుజీత్ సమయానికి సక్సెస్‌ఫుల్‌గా డెలివర్ చేస్తారని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.