“ఓజి”లో క్రేజీ సర్ప్రైజ్.. ట్రైలర్ లో చూపించనిది!

“ఓజి”లో క్రేజీ సర్ప్రైజ్.. ట్రైలర్ లో చూపించనిది!

Published on Sep 24, 2025 7:08 AM IST

OG movie

మొత్తానికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ బిగ్ డే ఇపుడు రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ఓజి ఇవాళ ప్రీమియర్ షోస్ తో థియేటర్స్ లో బ్లాస్ట్ కి సిద్ధం అయ్యింది. అయితే పవన్ తో యంగ్ దర్శకుడు సుజీత్ అసలు ఏం కుక్ చేసాడు అనే దానిపై విపరీతంగా హైప్ నెలకొంది.

అయితే మొన్న వచ్చిన ట్రైలర్ కే అంతా మెంటల్ ఎక్కిపోయారు. కానీ థియేటర్స్ లో అంతకు మించిన క్రేజీ ట్రీట్ ని సుజీత్ దాచి ఉంచాడు. ఈ సినిమాలో పవన్ సమురాయ్ గెటప్ గుర్తుందా? అందులో పోర్షన్స్ సినిమాలో సర్ప్రైజ్ చేసేలా ఉన్నాయని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ పై లేటెస్ట్ ఓ పిక్ కూడా కనిపిస్తుంది. సుజీత్, నవీన్ నూలి స్టూడియో బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ లో చూస్తే ఇది కనిపిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పై థియేటర్స్ లో సుజీత్ ఒక ఊహించని బ్లాస్ట్ ని అందించబోతున్నాడు అని చెప్పవచ్చు.

తాజా వార్తలు