వరల్డ్‌వైడ్ సెన్సేషన్‌గా ‘చికిరి చికిరి’

వరల్డ్‌వైడ్ సెన్సేషన్‌గా ‘చికిరి చికిరి’

Published on Nov 8, 2025 11:04 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” చిత్రంలోని “చికిరి చికిరి” పాట ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చరణ్ స్టైల్ కలగలిసి మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ లవ్ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన పాటగా రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారత్‌తో పాటు కువైట్, బహ్రైన్, యూఏఈ, ఖతర్, ఐర్లాండ్, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, అమెరికా, న్యూజిలాండ్, స్వీడన్‌ సహా 13 దేశాల్లో ట్రెండ్ అవుతోంది. రెహమాన్ మ్యూజిక్, చరణ్ ఎనర్జీ ఈ హైప్‌కు ప్రధాన కారణాలు.

తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా, డబ్డ్ వర్షన్ కు అద్భుత స్పందన లభిస్తోంది. శక్తివంతమైన గ్లింప్స్‌ తర్వాత, ఈ ఫస్ట్ సింగిల్‌తో టీమ్ మరోసారి పెద్ద సక్సెస్ అందుకుంది. ఇప్పుడు “పెద్ది”పై ఉన్న హైప్ మరింత పెరిగింది.

తాజా వార్తలు