డే 2 సాలిడ్ బుకింగ్స్ తో ‘ది గర్ల్ ఫ్రెండ్’

డే 2 సాలిడ్ బుకింగ్స్ తో ‘ది గర్ల్ ఫ్రెండ్’

Published on Nov 8, 2025 10:00 PM IST

The-Girlfriend Movie

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అలాగే యంగ్ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన లవ్ స్టోరీ చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్”. ట్రైలర్, ప్రమోషన్స్ తో మంచి బజ్ తోనే థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా తర్వాత డీసెంట్ టాక్ కూడా సొంతం చేసుకుంది. ఇలా థియేటర్స్ లో మొదటి రోజు సక్సెస్ ఫుల్ రన్ తర్వాత డే 2 లోకి వచ్చింది.

మరి ఈ రెండో రోజు కూడా సాలిడ్ బుకింగ్స్ ని ఈ సినిమా కనబరుస్తూ ఉండడం విశేషం. బుక్ మై షోలో ఆల్రెడీ ట్రెండింగ్ లో బుకింగ్ కనబడుతుండగా మ్యాట్నీ నుంచే ఈ సినిమాకి దాదాపు అన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సి ఈ సినిమాకి నమోదు అవుతుంది. దీనితో రెండో కూడా కూడా తెలుగు స్టేట్స్ లో మంచి వసూళ్లే ఈ సినిమాకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా విడుదల అయ్యింది.

తాజా వార్తలు