‘చికిరి చికిరి’ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్.. ‘పెద్ది’ మ్యానియా మామూలుగా లేదుగా!

‘చికిరి చికిరి’ సాంగ్‌కు ట్రెమండస్ రెస్పాన్స్.. ‘పెద్ది’ మ్యానియా మామూలుగా లేదుగా!

Published on Nov 8, 2025 6:06 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇటీవల ‘చికిరి చికిరి’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాటకు ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన మ్యూజిక్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ పాటలో చరణ్ స్టెప్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పాట చక్కటి లిరిక్స్, ఆకట్టుకునే మ్యూజిక్‌తో ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారింది. ఈ పాటకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.

ఇప్పటికే ఈ పాటకు ఏకంగా 1 మిలియన్‌కు పైగా లైకులు వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇంతటి ప్రజాదరణ దక్కినందుకు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

తాజా వార్తలు