గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై హైప్ పెంచిన మహేష్

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పై హైప్ పెంచిన మహేష్

Published on Nov 8, 2025 9:06 PM IST

SSMB29

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ SSMB29 చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి త్వరలో ఓ గ్రాండ్ ఈవెంట్ జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించడం.. ఇదే పనిలో ప్రమోషన్స్ షురూ చేయడంతో సోషల్ మీడియాలో ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై హైప్ క్రియేట్ అవుతోంది.

నవంబర్ 15న ఈ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో జరగనుంది. తాజాగా ఇదే విషయాన్ని మహేష్ బాబు మరోసారి ప్రమోట్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో SSMB29 ప్రపంచాన్ని యావత్ ప్రపంచం చూడబోతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఇంకా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.

తాజా వార్తలు