రీసెంట్ కాంట్రవర్సియల్ బాలీవుడ్ సినిమాకి ఓటిటి డేట్ ఫిక్స్!

రీసెంట్ కాంట్రవర్సియల్ బాలీవుడ్ సినిమాకి ఓటిటి డేట్ ఫిక్స్!

Published on Nov 9, 2025 1:00 AM IST

బాలీవుడ్ సినిమా నుంచి ఆ మధ్య కాలంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్” ఎలాంటి సంచలనం సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నుంచి ఆ తరహాలో మరిన్ని సినిమాలు కూడా ప్లాన్ చేశారు. అలా చేసిన మరో చిత్రమే “ది బెంగాల్ ఫైల్స్”.

ఈ సినిమాకి కూడా థియేటర్స్ లో చూసిన కొంతమంది నుంచీ మంచి రెస్పాన్స్ లభించింది. అయితే కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ కాలేదు కానీ ఈ సినిమా పలు యదార్ధ సంఘటనలు ఆధారంగా తెరకెక్కింది. ఇలా ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా సిద్ధం అయ్యింది. ఈ సినిమా ఓటిటి హక్కులు జీ 5 సొంతం చేసుకోగా వారు లేటెస్ట్ గా దీని డేట్ ని అందించారు.

దీని ప్రకారం ఈ నవంబర్ 21 నుంచి కేవలం హిందీలో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు ఓటిటిలో ఈ సినిమాని చూడొచ్చు. ఇక ఈ సినిమాలో సిమ్రాత్ కౌర్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తిలు ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు