రాబోయే దసరాకు సంక్రాంతి సీన్ రిపీట్ కానుందా ?

టాలీవుడ్లో స్టార్ హీరోలు గతంలో మాదిరి ఒకేసారి సినిమాల్ని విడుదల చేయడం మంచిదికాదనుకునే రోజులు పోయాయి. ఎంత పోటీ ఉన్నా సినిమాపై నమ్మకముంటే బరిలోకి దిగిపోతున్నారు. అందుకు నిదర్శనమే గత సంక్రాంతి సీజన్లో ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ చిత్రాల యుద్దం. ఒక్కరోజు గ్యాప్లో విడుదలైనా కూడా రెండూ మంచి విజయాల్ని అందుకుని భారీ వసూళ్లు రాబట్టాయి. ఇదే సీన్ మళ్లీ దసరా సీజన్లో రిపీట్ అయ్యేలా కనబడుతోంది.

ఎందుకంటే తారక్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ముందు అనుకున్నట్టు జూలై 30న కాకుండా దసరాకు వస్తుందనే టాక్ ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల ప్రాజెక్ట్ కూడా మొదట్లో ఆగష్టు 14న వస్తుందని అన్నారు కానీ ఇప్పుడు మాత్రం విజయదశమికే ఫిక్స్ అని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ ముందు భారీ పోరు తప్పదు. ఒకేరోజు కాకపోయినా ఒకటి రెండు రోజుల గ్యాప్లో విడుదలైనా విపరీతమైన పోటీ ఖాయం.

Exit mobile version