టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జ నుంచి వస్తున్న నెక్స్ట్ అవైటెడ్ చిత్రమే ‘మిరాయ్’. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులతో రాబోతుండగా మేకర్స్ లేటెస్ట్ గానే ఈ సినిమా వారం వాయిదా వేసి కొత్త డేట్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషలు సహా పలు అంతర్జాతీయ భాషలలో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక థియేటర్స్ కాకుండా నాన్ థియేట్రికల్ ఇంకా, ఓటిటికి సంబంధించి ఇపుడు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఇక టెలివిజన్ వరకు వస్తే స్టార్ సంస్థ వారు తీసుకున్నారట. సో మిరాయ్ సినిమా థియేటర్స్ రన్ తర్వాత వాటిలో వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.