టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!

Bahubali-The-Epic

ఇండియన్ సినిమా ముఖాన్నే మార్చివేసిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం బాహుబలి. గత పదేళ్ల కితం రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ్ టీం ల కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు తెలుగు సినిమా ఉన్నత శిఖరాల్లో ఉంది. ఇక ఈ రెండు భాగలని మేకర్స్ ఒకటిగా మార్చి బాహుబలి ది ఎపిక్ గా మార్చి సింగిల్ పార్ట్ గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ పార్ట్ నుంచి వచ్చిన టీజర్ మైండ్ బ్లాకింగ్ గా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆ విజువల్స్ తాలూకా క్వాలిటీ మాత్రం అత్యద్భుతంగా కనిపిస్తుంది. దీనితో ఈసారి థియేటర్స్ లో మాత్రం నిజంగానే ఎపిక్ ట్రీట్ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఇదిలా ఉండగా బాహుబలి ది ఎపిక్ ఐమాక్స్ వెర్షన్ సహా 4డిఎక్స్ ఇంకా ఎక్స్ బాక్స్ లాంటి ఇతర వెర్షన్ లలో కూడా ఈ అక్టోబర్ 31న విడుదల కానుంది అని కన్ఫర్మ్ చేసారు. మొత్తానికి థియేటర్స్ లో మాత్రం బాహుబలి రీరిలీజ్ దుమ్ము లేపే లానే కనిపిస్తోంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version