‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ బాగానే ఉందని చెప్పాలి. ఈ మధ్య వస్తున్న సినిమాలు చాలా వరకు పాటలు పరంగా మొదట ప్రోమో లాంటివి విడుదల చేసి ఆ తర్వాత ఫుల్ సాంగ్ విడుదల చేస్తున్నారు.

కానీ ఓజి విషయంలో ఇలా చేయడం లేదు. డైరెక్ట్ పాటలే విడుదల చేసేస్తున్నారు. మొన్న ఫస్ట్ సింగిల్ ఇప్పుడు రెండో సాంగ్ కూడా అంతే విధంగా విడుదల చేస్తున్నారు. రేపు ఉదయం సాంగ్ వస్తుంది కానీ ప్రోమో మాత్రం లేదు డైరెక్ట్ సాంగ్ అని తెలిపారు. ఒకప్పుడు నేరుగా ఫుల్ సాంగ్స్ ఒకేసారి ఆల్బమ్ గా వచ్చేవి.

కానీ ఆ ఫార్మాట్ మారి ఇప్పుడు ప్రోమోలు ఫస్ట్ సింగిల్స్ అంటూ వస్తున్నాయి. ఈ ట్రెండ్ లో ప్రోమో లేకుండా డైరెక్ట్ సాంగ్ తీసుకొస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ మరింత బిల్డ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతోంది.

Exit mobile version