2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?

coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సాలిడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రమే ‘కూలీ’. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ 2025 ఏడాదిలో కూలీ సినిమా మరో ఫీట్ ప్రస్తుతానికి సాధించినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ ఏడాదికి ఓవర్సీస్ మార్కెట్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ సినిమాగా నిలిచినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నుంచి సైయారా మొదటి స్థానంలో ఉంటే దానిని కూలీ కేవలం ఈ 11 రోజుల్లోనే క్రాస్ చేసి ఇపుడు 20 మిలియన్ డాలర్స్ వైపు వెళుతున్నట్టు తెలుస్తుంది. దీనితో కూలీ ఈ రకంగా లీడ్ లో ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం కూలీ సినిమా థియేటర్స్ లో రన్ అయితే డీసెంట్ గానే కొనసాగిస్తుంది. మరి ఫైనల్ మార్క్ గా ఎక్కడ ఆగుతుందో చూడాలి.

Exit mobile version