‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఓజి”. ఎన్నో అంచనాలు నడుమ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రేపు రెండో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సాంగ్ తోనే రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ అప్డేట్స్, ప్రమోషన్స్ కూడా మొదలు పెడదాం అన్నట్టుగా ఇపుడు మరింత హైప్ ఎక్కిస్తున్నారు. దీనితో రేపటి నుంచే ఓజి హంట్ మొదలని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. ఇక ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version