కరోనా వైరస్ కారణంగా నాగర్జున సినిమా షూట్ క్యాన్సిల్

సీనియర్ హీరో నాగార్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. నాగార్జున ఎంతో ఇష్టంతో ఈ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగర్జునకి జోడీగా సయామీ ఖేర్ నటిస్తోంది. ఇన్నాళ్ళు నిర్విరామంగా షూటింగ్ చేసిన బృందానికి కరోనా వైరస్ దెబ్బ తగిలింది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ థాయిలాండ్ లొకేషన్లలో ప్లాన్ చేశారు టీమ్. కానీ కరొనా వైరస్ కారణంగా అక్కడి షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు టీమ్.

ఇప్పటికే థాయిలాండ్ దేశంలో పాతిక వరకు కరోనా కేసులు నమోదుకావడం వలన దర్శక నిర్మాతలు సభ్యుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version