‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. తన పాన్ ఇండియా హిట్ చిత్రాలు కేజీఎఫ్ తర్వాత తన నుంచి ఎలాంటి సినిమా వస్తుంది అనే సమయంలో గ్రాండ్ గా సినిమాని తాను అనౌన్స్ చేసాడు. అయితే ఈ సినిమా విషయంలో యష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ప్రతీ చిన్న అంశంలో కూడా తాను కూడా ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక దీనితో పాటుగా తాను ఈ సినిమా కోసం దర్శకునిగా కూడా మారినట్టు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నప్పటికీ కొన్ని పోర్షన్స్ వరకు మాత్రం యాష్ పర్శనల్ కేర్ తీసుకొని తాను తన విజన్ తో డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాని వెంకట్ కే నారాయణ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 19న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

Exit mobile version