ఎస్.ఎస్ రాజమౌళి కి బాలీవుడ్ హీరో గురువా.!

ఎస్.ఎస్ రాజమౌళి కి బాలీవుడ్ హీరో గురువా.!

Published on Nov 30, 2012 11:15 AM IST


వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్లో తిరుగులేని టాప్ డైరెక్టర్ ఎవరూ అని అడిగితే అందరూ ముక్త కంఠంతో చెప్పే ఒకే ఒక పేరు ఎస్.ఎస్ రాజమౌళి. టాలీవుడ్లో అందరూ హీరోలు ఆయనతో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే బాగుంటుంది అని అనుకుంటారు. రాజమౌళికి మాత్రం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో సినిమా చేయాలనుందని అంటున్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే ‘ నాకు బాలీవుడ్లో ఉన్న హీరోలందరూ ఇష్టం. అందరికన్నా అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టం. అమీర్ ఖాన్ ని నా గురువుగా భావిస్తాను. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఉంది. నాకు తనతో సినిమా చేసే అవకాశం వస్తే ఎట్టి పరిస్తితుల్లోనూ వదులుకోనని మరియు అమీర్ ని డైరెక్ట్ చేస్తానని’ రాజమౌళి అన్నారు.

రాజమౌళి డైరెక్ట్ చేసిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’ సినిమా ఈ సంవత్సరం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్ తో చేయనున్న హై బడ్జెట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అన్నీ కుదిరి ఈ ఇద్దరు పర్ ఫెక్ట్స్ కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. టాలీవుడ్ క్రేజీ మరియు క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి కోరిక నెరవేరాలని కోరుకుందాం.

తాజా వార్తలు