ఒక సినిమా కోసం 400 సినిమాలు చూసిన భీమనేని


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ చిత్రం ఆగష్టు 24న విడుదల కానుంది. తమిళంలో విజయం సాదించిన ‘తమిళ్ పడం’ చిత్రానికి రిమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇటీవలే మీడియాతో మాట్లాడిన భీమనేని ఈ చిత్రానికి సంభందించిన ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశారు. ‘ ఈ చిత్రం కోసం తమిళ చిత్ర రిమేక్ రైట్స్ కొనుక్కున్నా తెలుగులో అలానే తీయాలనుకోలేదు మరియు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మరియు ఇండస్ట్రీలోని పెద్దల మీద కామెడీ చేయకూడదు అనుకున్నాం. అందుకే ఈ చిత్రంలో నటీనటుల వ్యక్తిగత విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం వారు నటించిన సినిమాల్లోని వారి పాత్రలను మాత్రమే పేరడీ చేశాము.

82 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ మేము 2000 సంవత్సరం నుంచి వచ్చిన హిట్ సినిమాల్లోని సన్నివేశాలను మాత్రమే పేరడీ చేశాము, ఎందుకంటే అంతకన్నా ముందుకెలితే ప్రేక్షకులకు అంతగా గుర్తుండే అవకాశం ఉండదు. ఈ చిత్రం కోసం 400 సినిమాలు చూసి, సూపర్ హిట్ చిత్రాల్లోని ఫేమస్ సన్నివేశాలను రాసుకుని కథ తయారు చేశాము. అందువల్ల ఈ చిత్రాన్ని రిమేక్ అనడం కంటే డైరెక్ట్ తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం మొదటి నుంచి చివరి వరకూ వచ్చే ప్రతి పేరడీ సన్నివేశం మరియు కాస్ట్యూమ్స్ ప్రేక్షకులను తెగ నవ్విస్తాయని’ ఆయన అన్నారు.శ్రీ వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్లో ఏ చిత్రం తెరకెక్కనంత బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం, అలాగే ఈ చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మంచి రేటుకి అమ్ముడుపోయాయని అంటున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించారు.

Exit mobile version