‘వార్ 2’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే!

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వార్ 2” కోసం అందరికీ తెలిసిందే. నార్త్ నుంచి సౌత్ వరకు భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఎట్టకేలకి ఫస్ట్ సింగిల్ పై క్లారిటీ వచ్చింది.

మేకర్స్ లేటెస్ట్ గా హృతిక్ రోషన్ మరియు హీరోయిన్ కియారా అద్వానీలపై ప్లాన్ చేసిన ఫస్ట్ సింగిల్ తాలూకా మూడు భాషల ప్రోమోని ఇప్పుడు విడుదల చేశారు. డీసెంట్ గా సాగుతున్న ఈ రొమాంటిక్ సాంగ్ ని అనౌన్స్ చేశారు. ఇక ఈ ఫుల్ సాంగ్ ని రేపు అక్టోబర్ 31న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఆగస్ట్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version