సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న మంచు విష్ణు

సిక్స్ ప్యాక్ తో కనిపించనున్న మంచు విష్ణు

Published on Sep 22, 2013 5:00 PM IST

Vishnu-Manchu

మంచు వారబ్బాయి మంచు విష్ణు హీరోగా తెలుగు తెరకి పరిచయమయినప్పుడు కాస్త బొద్దుగా ఉండేవాడు. కానీ తన పర్సనాలిటీ, లుక్స్ పరంగా కొన్ని విమర్శలు ఎదుర్కోవడంతో కృష్ణార్జున సినిమా తర్వాత జిమ్ కి వెళ్లి బాగా స్లిమ్ అండ్ హన్డ్సం గా తయారయ్యాడు. ప్రస్తుతం ఆయన తన కండలు తిరిగిన బాడీని చూపించడానికి సిద్దమవుతున్నాడు. అలాగే తను లైపోసెక్షన్ అని వస్తున్నా వార్తలని ఖండించారు.

ప్రస్తుతం మంచు విష్ణు మరో మెట్టు పైకి ఎక్కి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అది కూడా డా. మోహన్ బాబు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీలో విష్ణు సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనున్నాడు. సిక్స్ పాక్స్ రావడం కోసం ఇంకా సగం దూరంలో అని చెబుతున్నాడు. దీన్ని బట్టి త్వరలోనే విష్ణు మంచి ఫిజిక్ తో కనిపించానున్నాడని ఆశించవచ్చు.

ఆ సినిమా కాకుండా ప్రస్తుతం మంచు విష్ణు ‘దూసుకెళ్తా’ సినిమాలో నటిస్తున్నాడు. వీరూ పోట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో లావణ్య హీరోయిన్ గా కనిపించనుంది.

తాజా వార్తలు