ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న సెన్సేషనల్ ‘మహావతార్ నరసింహా’

Published on Sep 18, 2025 7:03 PM IST

mahavatar

కన్నడలో తెరకెక్కిన యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దర్శకుడు అశ్విన్ కుమార్ భారత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కించిన ‘మహావతార్ నరసింహా’ యానిమేషన్ చిత్రాన్ని పలు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి యానిమేషన్ చిత్రంగా మహావతార్ నరసింహా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సెన్సేషనల్ చిత్రం సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12.30 గంటలకు స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది.

బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రెస్టీజియస్ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు