OG : ఏపీలో టికెట్ బుకింగ్స్ షురూ.. బాక్సాఫీస్ లెక్కలు మారడం ఖాయం..!

OG : ఏపీలో టికెట్ బుకింగ్స్ షురూ.. బాక్సాఫీస్ లెక్కలు మారడం ఖాయం..!

Published on Sep 18, 2025 5:03 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 25న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాను తొలిరోజే చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఈ చిత్ర టికెట్ బుకింగ్స్ తాజాగా ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ఓజి చిత్రానికి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో వారం రోజులు ముందుగానే ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ఓజి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 25న అర్థరాత్రి 1 గంటకు.. 1.15 గంటలకు సంబంధించిన టికెట్స్ ఓపెన్ కావడం తో అభిమానులు బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు