హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
భద్రకాళి కథ ఎలా ఉండబోతుంది?
భద్రకాళి పొలిటికల్ థ్రిల్లర్. కరెంట్ పాలిటిక్స్ ఇందులో కోర్ ఎలిమెంట్. నేను పొలిటికల్ మీడియేటర్ గా కనిపిస్తాను. సాదరణంగా రాజకీయాల్ని మనం సినిమాల్లో చాలా డ్రమెటిక్ గా చూస్తాం. కానీ ఈ సినిమాలో పాలిటిక్స్ చాలా నేచురల్ గా చూపించడం జరిగింది. రాజకీయాల్లో ఒక మీడియేటర్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక పెద్ద పెద్ద స్కాం లో తన పాత్ర ఏమిటి? అనేది ఆడియన్స్ కి న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ పాలిటిక్స్ ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకునేలా వుంటుంది.
పాటలకి స్కోప్ ఉందా?
ఆర్ఆర్ ఇందులో చాలా క్రూషియల్. అలాగే నాలుగు పాటలు ఉన్నాయి. ఆ నాలుగు కూడా సిచువేషనల్ సాంగ్స్ మోంటేజెస్. కథకు అనుగునంగానే వస్తాయి.
హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియా క్యారెక్టర్స్ గురించి?
ఈ చిత్రంలో తృప్తి రవీంద్ర వైఫ్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. రియా పోలీస్ క్యారెక్టర్ చేస్తుంది. నన్ను క్యాచ్ చేయాలనుకునే క్యారెక్టర్ అది. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
25 సినిమాల జర్నీ ఎలా అనిపించింది?
చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు ఎంతో ప్రేమ అభిమానాన్ని పంచారు. తెలుగు ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించారు. నాకు టాలెంటు ఉందో లేదో తెలియదు కానీ నేను చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను. భవిష్యత్తులో కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసి నిజాయితీతో కూడిన సినిమాలని చేయాలని భావిస్తున్నాను.
మీరు యాక్టింగ్, డైరెక్షను, మ్యూజిక్ ఇలా చాలా డిపార్ట్మెంట్స్ చేస్తున్నారు కదా.. ఈ విషయంలో ఒత్తిడి ఉంటుందా?
ఎలాంటి ఛాలెంజ్ లేదు. ఎందుకంటే ఒక సమయంలో ఒకటి ఒకే పని చేస్తాను. అయితే సమయాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది కొంచెం ఛాలెంజ్ తో కూడుకున్న విషయం. యాక్టింగ్, నిర్మాణం కారణంగా మ్యూజిక్ కి తక్కువ సమయం వుంటుంది. ఇకపై మ్యూజిక్ కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించాలని భావిస్తున్నాను.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
బిచ్చగాడు డైరెక్టర్ తో వంద దేవుళ్ళు సినిమా చేస్తున్నాను. బిగ్ స్కేల్ మూవీ అది. తెలుగు తమిళ్లో రెండు భాషల్లో ఒకేసారి ఆ సినిమా రిలీజ్ అవుతుంది.