‘ఓజి’ రన్ టైం లాక్.. ఎంతసేపు విధ్వంసం అంటే!

‘ఓజి’ రన్ టైం లాక్.. ఎంతసేపు విధ్వంసం అంటే!

Published on Sep 18, 2025 4:01 PM IST

OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇపుడు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇలా రీసెంట్ గానే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా ఈ సినిమా పూర్తి చేసుకున్నట్టుగా టాక్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి రన్ టైం పై లేటెస్ట్ న్యూస్ వినిపిస్తుంది.

దీని ప్రకారం సినిమా మొత్తం 156 నిమిషాల నిడివితో రాబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. అంటే రెండు గంటల 36 నిమిషాల పాటు ఓజి మ్యాడ్నెస్ ఉండబోతుంది అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

తాజా వార్తలు