పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పోస్టర్‌తో హీట్ పెంచిన మేకర్స్ – ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Sep 18, 2025 2:46 PM IST

OG Trailer

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ ప్రేక్షకులంతా కూడా ఈ సినిమాకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సినిమా ట్రైలర్ రాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10:08 గంటలకు ఓజి ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారని టీమ్ స్పష్టం చేసింది. ఈ అప్‌డేట్‌కు సంబంధించిన ఓ స్టైలిష్ పోస్టర్‌ను వెలువరించి, అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు.

యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందించగా, పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్‌లో సరికొత్త ఎనర్జీతో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్లు సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి.

సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి కీలక ప్రతినాయక పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా మెరిసనుంది. సంగీతం దర్శకుడు థమన్ అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మీద ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన డివివి ఎంటర్టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్ రాబోతోందని అభిమానులు ధైర్యంగా చెబుతున్నారు.

తాజా వార్తలు