మాఫియా నేపథ్యంలో తండ్రికొడుల క్రేజీ ప్రాజెక్ట్?

చియాన్ విక్రమ్ తన కొడుకు ధృవ్ విక్రంతో కలిసి ఓ మూవీ చేయనున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తుండగా, ఇది నిజమేనంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది. నేడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. రివాల్వర్ ని ఒకరు మరొకరిని ఇస్తున్నట్లు ఆ ఫోటో ఆసక్తి రేపుతోంది. విక్రమ్ 60వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ అంచనాలు పెంచేదిగా ఉంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, లలిక్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ మాఫియా నేపథ్యంలో తెరక్కే సూచనలు కలవు. అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే తండ్రి మాఫియా ఎంపైర్ కి వారసుడిగా ధృవ్ కనిపిస్తాడని అనిపిస్తుంది. మరి ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం విక్రమ్ పొన్ని యన్ సెల్వమ్ మూవీతో పాటు కోబ్రా చిత్రాలలో నటిస్తున్నారు. కోబ్రా షూటింగ్ చివరి దశకు చేరుకోగా విడుదలకు సిద్ధం అవుతుంది. ధృవ్ గత ఏడాది విడుదలైన ఆదిత్య వర్మ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Exit mobile version