మ్యూజికల్ ట్రీట్ రెడీ చేసిన అనుష్క ‘ఘాటి’.. ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేశారు. ‘సైలోరే’ అంటూ సాగే ఈ పాటను జూన్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు ఓ కొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తు్న్నాయి. ఈ చిత్రాన్ని జూలై 11న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Exit mobile version