తమిళ హీరో సూర్య రీసెంట్గా ‘రెట్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సూర్య తన కెరీర్లో 45వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆర్జె బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
‘సూర్య 45’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌ను జూన్ 20న ఉదయం 10 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ అనౌన్స్మెంట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో ఓ గుర్రం కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ జోడీని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.